PAN Card | పాన్ కార్డు పొరపాట్లు సరిదిద్దుకోవాలా.. ఇలా చేస్తే సరి !
PAN Card | పాన్ కార్డులో తప్పులు దొర్లితే ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ఫిర్యాదు చేయొచ్చు.
PAN Card | ఇప్పుడు ఏ ఆర్థిక లావాదేవీ నిర్వహించాలన్న పాన్ కార్డు (PAN Card) దాఖలు చేయడం తప్పనిసరి. ఏదేనీ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా ప్రారంభించాలన్నా.. ప్రతిఏటా ఐటీ రిటర్న్స్ సమర్పించాలన్నా.. భారీ మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, డీడీ, చలాన్లు భారీ మొత్తంలో తీసుకున్నా, అన్ని రకాల లావాదేవీలకు పాన్ కార్డు ఉపయోగించాల్సిందే. ఒక గుర్తింపు కార్డు కూడా పాన్ కార్డు ఉపయోగ పడుతుంది.
పాన్ కార్డు గ్రీవెన్స్ ఇలా సులభతరం
కనుక ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తకుండా పని సాఫీగా సాగాలంటే పాన్ కార్డులో తప్పుల్లేకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి. పాన్ కార్డులో తప్పొప్పులను, ఇతర సమస్యలను సులభంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం.. పాన్ కార్డు గ్రీవెన్స్ సర్వీసు మరింత సులభతరం చేసింది. పాన్ కార్డు దారులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ ఫిర్యాదులు చేయొచ్చు.
పొరపాట్లపై సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలిలా
సాధారణంగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు జరిగే తప్పుల్లో ఒకటి పేరు తప్పుగా నమోదు కావడం. భారత్ అంతటా పాన్ కార్డును గుర్తింపు కార్డుగా వినియోగిస్తున్నందున.. ఏదైనా తప్పుగా నమోదైతే వెంటనే చెక్ చేసుకోవాలి. అలాగే ఒక్కోసారి పాన్ కార్డు మీద మీ ఫొటోకు బదులు మరొకరి ఫొటో ముద్రితం కావచ్చు. ఫొటో సరిగ్గా లేకపోయినా వెంటనే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలి.
సకాలంలో పాన్ కార్డు లభించకుంటే ఇలా
ఒక్కోసారి దరఖాస్తు చేసిన వ్యక్తికి వివిధ కారణాలతో పాన్ కార్డు అందక పోవచ్చు. అప్పుడు ఆ పాన్ కార్డు తిరిగి ఐటీ శాఖ అధికారులకు చేరుతుంది. ఒక్కోసారి పొరపాటున మరో అడ్రస్‌కు చేరవచ్చు. కనుక ఏ కారణం చేతనైనా పాన్ కార్డు అందక పోతే సంబంధిత దరఖాస్తు దారు అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే. పుట్టిన తేదీ, తప్పుగా తండ్రి పేరు నమోదు, అడ్రస్‌లో తప్పులు ఉంటే అధికారులకు తెలపాలి.
ఐటీ పోర్టల్ నుంచి ఇలా ఫిర్యాదు
ముందుగా ఆదాయం పన్ను విభాగం అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ‘పన్ను చెల్లింపుదారుల సేవలు’ అనే విభాగంపై క్లిక్ చేయాలి. ఇక్కడ ‘పాన్ గ్రీవెన్స్’ సెక్షన్కెళ్లాలి. పేజీ ఓపెన్ అయిన తర్వాత మీ కంప్లయింట్తోపాటు సంబంధిత సమాచారం (పేరు, పాన్ కార్డ్ నంబర్, వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్ ఐడీ) నమోదు చేసి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
టిన్ ప్రోటీన్ ఈగవ్ టెక్నాలజీ వెబ్‌సైట్‌తో ఫిర్యాదు
ముందు TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ పోర్టల్‌ను సందర్శించాలి. వెబ్సైట్లో కస్టమర్ కేర్ సెక్షన్ కెళ్లాలి. కంప్లయింట్స్ / క్వెరిస్ లో గల దరఖాస్తు ఫామ్ క్లిక్ చేసి పూర్తి చేయాలి. ఫామ్ పూర్తి చేశాక చివరిలో క్యాప్చా కోడ్ నమోదు చేసి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
ఆఫ్‌లైన్ ద్వారా ఇలా
ఆదాయం పన్ను విభాగం హెల్ప్ డెస్క్ – 18001801961, TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ కాల్ సెంటర్ +91 2027218080 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఈ-మెయిల్ ఐడీ ask@incometax.gov.inకి కూడా ఫిర్యాదు చేయొచ్చు. పాన్ కార్డు కోసం ఫిర్యాదు చేసిన వారికి ఫిర్యాదు నంబర్ ఇస్తారు. ఆ ఫిర్యాదు స్టేటస్ తెలుసుకోవడానికి కంప్లయింట్ చేసిన పోర్టల్‌లో మీ ఫిర్యాదు నంబర్, పాన్ నంబర్ నమోదు చేస్తే.. ఫిర్యాదు స్టేటస్ తెలిసిపోతుంది.
Read Today's Latest Earnings News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

