Hyderabad | చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది

కవాడిగూడ: చెట్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహాత్మాగాంధీ రూరల్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ ప్రసన్నకుమార్, రామకృష్ణామఠం స్వామి శితికంఠానందలు అన్నారు. ఈ మేరకు ఆదివారం దోమలగూడ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని రామకృష్ణా మఠంలో ఇన్షియేటీవ్ ఫర్ మోరల్ కల్చర్ ట్రైనింగ్ పౌండేషన్ (ఐఎంసీటీఎఫ్), హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రకృతి వందన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ప్రసన్నకుమార్, శితికంఠానందలు మాట్లాడుతూ వృక్షో రక్షతి రక్షతః అనే నినాదానికే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ చెట్లను, పర్యావరణాన్ని పరిరక్షించాలని వారన్నారు. పూర్వీకులు మనకు ఎలాంటి వాతావరణం, ప్రకృతిని ఇచ్చారో భవిష్యత్తు తరాలకు మనం అలాంటి సౌకర్యాన్ని ఇవ్వాలని వారు అన్నారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రామకృష్ణా మఠంలో ప్రతియేటా ప్రకృతి వందనం పేరుతో కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎంసీటీఎఫ్ అధ్యక్షుడు వినోద్, కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి, హెచ్‌ఎస్‌ఎస్‌ఎఫ్ కన్వీనర్ చంద్రశేఖర్, కార్యదర్శి రాంమూర్తి, కో-కన్వీనర్లు డాక్టర్ శ్రావణ్‌కుమార్, రాంరెడ్డి, సభ్యులు సురేయేష్, పద్మజ, పాత్రికేయులు లక్ష్మణ్ యాదవ్‌తో పాలు పర్యావరణ ప్రేమికులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
AP News | వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో గుర్రంపోడులో రాస్తారోకో
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

