osmania university | ఇంజినీరింగ్ ఫీజు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఓయూ వీసీ చాంబర్లో ధర్నా చేపట్టారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వ వర్సిటీలు విద్యావ్యాపారానికి తెరలేపడం దారుణమన్నారు. ఫీజులను ఒకేసారి రెట్టింపు చేయడమంటే పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడమేనని మండిపడ్డారు. నూతనంగా నియమితులైన వీసీలు ప్రగల్భాలు మాని, శాస్త్రీయత లేకుండా అనాలోచితంగా ఫీజులు ఎలా పెంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

