Sewarage technology | సీవరేజీ నిర్వహణలో కొత్త పోకడలు
Sewarage technology | హైదరాబాద్ మహా నగరంలో మురుగునీటి నిర్వహణకు జలమండలి చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగి పారిశుధ్య పనులు

సీవర్ క్రాక్ టెక్నాలజీతో సాఫీగా.. సురక్షితంగా..
సాఫీగా మురుగు నీరు ప్రవాహం..!
మ్యాన్‌హోల్ పూడిక తీతలో ఫలించిన సాంకేతిక పరిజ్ఞానం
ఫతేనగర్‌లో సీవర్ క్రాక్ టెక్నాలజీ విజయవంతం
భోలక్‌పూర్‌లో అమలు చేయాలని తాజాగా నిర్ణయం
సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మురుగునీటి నిర్వహణకు జలమండలి చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. కార్మికులు మ్యాన్‌హోళ్లలోకి దిగి పారిశుధ్య పనులు చేపట్టకుండా 73 మినీ జెట్టింగ్ యంత్రాలు తీసుకువచ్చి సీవరేజీ పనులు చేపడుతున్నారు. నిర్వహణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ ‘సీవర్ క్రాక్’ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో లేకుండా మురుగునీరు సాఫీగా వెళ్లే చర్యలు చేపట్టారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా డివిజన్-6 పరిధిలోని ఫతేనగర్‌లో ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఫతేనగర్ అత్యంత స్లమ్ ఏరియా కావడం, తరచు మ్యాన్‌హోల్స్ ఉప్పొంగే ప్రాంతాలు ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ మినీ జెట్టింగ్ మిషన్లకు సీవర్ క్రాక్‌ను జోడించి సీవరేజీ విభాగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చారు. సీవర్ క్రాక్ విధానం అమలుతో తరచు పొంగిపొర్లే సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యకు పరిష్కారం లభించింది. ఫిర్యాదుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని డివిజన్-6 జనరల్ మేనేజర్ హరిశంకర్ తెలిపారు. భోలక్పూర్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని తాజాగా ఎండీ దానకిశోర్ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో గ్రేటర్ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
సీవర్ క్రాక్ ప్రత్యేకతలు..
సీవర్ క్రాక్ పరిజ్ఞానాన్ని సానిటర్ సంస్థ రూపొందించింది. దాదాపు 12 కిలోల బరువుండే ఈ యంత్రం సీవరేజీ పైపులైను అడ్డుగా ఉన్న వస్తువులను తొలగిస్తుంది. ముందుగా ఈ యంత్రాలను జెట్టింగ్ యంత్రాలకు అనుసంధానం చేస్తారు. గుండ్రంగా ఉన్న ఈ యంత్రానికి మూడు వైపులా ఆరు వరుసల్లో చిన్న చక్రాలుంటాయి. వీటి సాయంతో యంత్రం సులువుగా ముందుకు సాగుతుంది. ఒక వేళ వాహనం బోల్తా పడ్డా మరో వైపున్న చక్రాల ద్వారా ముందుకు కదులుతుంది. అలాగే, వీటికే ముందు భాగంలో బలమైన బ్లేడ్లు ఉండటంతో అడ్డుగా ఉన్న వస్తువును ముకలు ముకలుగా చేస్తుంది. ఎలాంటి ధృడమైన వస్తువు ఉన్నా సులువుగా కట్ చేస్తుంది. తద్వారా సీవరేజీ ప్రవాహం సాఫీగా సాగుతుంది.
సీవరేజీ ఓవర్ ఫ్లో పరిష్కారంలో ఇది దిట్ట
సీవర్ క్రాక్: ఇది ఒక రొబోటిక్ యంత్రం. ఇది డ్రైనేజీ పైపులైన్ నుంచి ఇసుక, కంకర బురదను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ యంత్రాలు పైపు పరిణామానికి తగ్గట్టు మూడు సైజుల్లో ఉంటాయి. దీంతో మనుషులు మ్యాన్‌హోల్స్‌లోకి దిగాల్సిన అవసరం ఉండదు. ఈ యంత్రం మ్యాన్‌హోళ్ల ద్వారా లోనికి ప్రవేశించి పైపులైన్‌ను శుభ్రపరుస్తుంది.
బయో బాక్టీరియల్ ద్రవం: ఈ లిక్విడ్‌ను సెప్టిక్ ట్యాంకులు, సీవరేజీ పైపులైన్‌లోని బయోమాస్‌ను తీసేందుకు అవసరమయ్యే బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ఈ ద్రవం తప్పకుండా శుభ్రపరిచే చర్యలను తగ్గిస్తుంది. దీనిని వినియోగించడం చాలా సురక్షితం.
స్మార్ట్ ఓవర్ ఫ్లో డిటెక్టర్: ఇది ఎక్కడైనా మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి ఉంటే మ్యాన్‌హోల్స్ పొంగడం వంటి వాటిని గుర్తిస్తుంది. అలాగే, మ్యాన్‌హోల్స్‌లోని ప్రమాదకర వాయువులను గుర్తించడం దీని ప్రత్యేకత.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

