Hyderabad | నాటిన మొక్కలను సంరక్షించాలి : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

గోల్నాక : రహదారులకు ఇరువైపుల నాటిన మొక్కలను సంరక్షించి ఆహ్లదక వాతావరణాన్ని సృష్టించుకోవాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్‌పేట ప్రధాన రహదారి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సీపీ ఎల్ లకోటియా పాఠశాల వరకు స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో పాటు హర్టికల్చర్ విభాగం అధికారులతో కల సి రహదారులకు ఇరువైపులా ఇటీవల నాటిన మొక్కల పెంపకం పురోగతిని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి కాలేరు చేయూత
తిరుమలనగర్ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆర్థికసాయం చేశారు. మంగళవారం ఆయన తన సతీమణి,మాజీ కార్పొరేటర్ కాలేరు పద్మతో కలసి తిరుమలనగర్ రేణుకాఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి కోసం సాయం చేయాలని కోరగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రూ.50వేల నగదును కమిటీ సభ్యులకు అందజేశారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

