Breast cancer | రొమ్ము క్యాన్సర్‌పై అవగాహానకు పింక్ క్యాన్వాస్ దోహాదం : దగ్గుపాటి రానా

శేరిలింగంపల్లి : రొమ్ముక్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు పింక్ క్యాన్వాస్ కార్యక్రమం ఎంతగానో దోహాదపడుతుందని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, హిరో దగ్గుపాటి రానా అన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని అన్కో కాన్సర్స్ కేర్ సెంటర్ హాస్పటల్లో రొమ్ము క్యాన్సర్ అవగాహానకు ఏర్పాటుచేసిన పింక్ క్యాన్వాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళలు అధిక శాతం దీని భారిన పడుతున్నారన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహాన కల్పించి వారిని చైతన్యపరిచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పింక్ క్యాన్వాస్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు.
అన్కో డాట్ కాం సహా వ్యవస్ధాపకుడు డాక్టర్ అమిత్ జోత్వానీ మాట్లాడుతూ అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహాన మాసంగా జరుపుకోవడం జరుగుతుందని ఇందులో బాగంగా మహిళలకు దీనిపై మరింత అవగాహాన కల్పించేందుకు పింక్ క్యాన్వస్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అంకాలజిస్టు డాక్టర్ శిఖర్ కుమార్, డాక్టర్ గీతా నాగశ్రీ, డాక్టర్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

