ఎంఈ పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
వచ్చే నెల మొదటి వారంలోగా పీజీ మొదటి సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు సాధ్యమైనంత త్వరగా ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ నిర్దేశించారు. మొదటి సెమిస్టర్ థియరీ పరీక్షలు ముగిసిన వెంటనే ఈ పరీక్షలను నిర్వహించి, వచ్చే నెల 8వ తేదీలోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఆ మార్కుల జాబితాను తరువాత తమ కార్యాలయానికి చేర్చాలని సూచించారు.