వివిధ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంఫిల్ (క్లినికల్ సైకాలజీ) పార్ట్-1, పార్ట్-2, ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ బ్యాక్లాగ్ కోర్సులతో పాటు బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఎంఫార్మసీ పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఫార్మసీ (పీసీఐ-సీబీసీఎస్) అన్ని విభాగాల నాలుగో సెమిస్టర్ ప్రాజెక్ట్ డిసర్టేషన్ పరీక్షా ఫీజును వచ్చే నెల 10వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు.
ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తా మన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కోర్సుల నాలుగో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 1వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.