osmania university | ఉస్మానియా విద్యా సమాచారం

వివిధ పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలతో పాటు ఎనిమిదో సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను వెల్లడించినట్లు చెప్పారు. ఈ పరీక్షా ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఎంబీఏ పరీక్షా జవాబు పత్రాల ఫొటోకాపీ పొందేందుకు దరఖాస్తుల స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా జవాబు పత్రాల ఫొటోకాపీ పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ అన్ని సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశామని చెప్పారు. తమ జవాబు పత్రాల నకలు పొందగోరే వారు ఈ నెల 29వ తేదీ వరకు సంబంధిత రుసుము చెల్లించి, తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవాలని పేర్కొన్నారు.
అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ తదితర పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సు తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

