కాచిగూడ: అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రొద్భలంతో గోల్నాక ప్రాంతానికి చెందిన శ్రీలత 5వ తరగతి చదువు తుంది. ఇటీవల జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో నిర్వహించిన పాటల పోటీల కార్యక్రమంలో పాల్గొని పలుబాషల పాటలు పాడి రికార్డులను సాధించింది. ఈ సందర్భంగా ఆ చిన్నారి శ్రీలతను ఆదివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయి, పొత్కల సంతోశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.