100 years | శతాధిక వృద్ధున్ని సన్మానించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్

కాచిగూడ : సంపూర్ణ ఆరోగ్యంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శతాధిక వృద్ధుడు హరిలాల్ పహిల్వాన్ (104) ను స్థానిక ఎమ్మెల్యే సత్కరించారు. కాచిగూడ డివిజన్లోని చెప్పల్‌బజార్ ప్రాంతానికి చెందిన హరిలాల్ పహిల్వాన్ 104 ఏండ్ల వయస్సులోనూ ఆరోగ్యంగా ఉండడం ఆనందకరమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని కోరారు.15 నుంచి 18 సంవత్సరాల యువతి,యువకులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ను వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రజలందరూ అరోగ్యంపట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర భీష్మాదేవ్, బండసూరి, దిడ్డి రాంబాబు, సునీల్బిడ్లాన్, కె.సదానంద్, నాగేందర్బాబ్జి, బి.కృష్టాగౌడ్, బబ్లూ, నర్సింహ్మరెడ్డి, సాయిబాబా, రాజేశ్,బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

