దుర్గాబాయి దేశ్ముఖ్(ఆంధ్ర మహిళా సభ) కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మీడియా ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికిగాను కర్నాటక సంగీతం, భక్తి సంగీత మ్యూజిక్ విభాగాలలో మహిళలకు శిశక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల కార్యదర్శి.వై రమాప్రభ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరు నెలల వ్యవధిగా కర్నాటక సంగీతం, మూడు నెలల వ్యవధిగా సంకీర్తన (భక్తీ మ్యూజిక్)కోర్సులలో మహిళలకు వయస్సు, విద్యార్హలతో నిమిత్తం లేకుండా శిక్షణ ఇవ్వనున్నట్లు పే ర్కొన్నారు. అసక్తిగల వారు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 04027070052, 9441768811 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు నని తెలిపారు.