Hyderabad | మహిళా సాధికారత ప్రాజెక్ట్ కు జర్మన్ ఫండింగ్

కొండాపూర్: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శీల సూర్యనారాయణన్ మహిళల సాధికారత కోసం రూపొందించిన ‘ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషనల్ ల్యాండ్‌స్కేప్ టూవర్డ్స్ ఉమెన్స్ ఎంపవర్మెంట్’ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మక జర్మన్ ఫండింగ్‌కు ఎంపికైనట్లు వర్సిటీ యాజమాన్యం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థినీలకు లింగ వివక్షతపై అవగాహన కల్పించడంతో పాటు లైఫ్ -కోర్సు నిర్ణయాలను తీసుకునే అంశాల అధ్యయనం ఉంటుందన్నారు.
ముఖ్యంగా నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్ధూ యూనివర్సిటీ, ఉస్మా నియా యూనివర్సిటీల విద్యార్థినీలు, వారి ఉపాధ్యాయులకు అవకాశాలున్నట్లు తెలిపారు. మహిళల సాధికారతకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) సైతం ఈ ప్రాజెక్ట్ ను గుర్తించినట్లు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

