బంజారాహిల్స్ : సిలిండర్నుంచి గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగిన ఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్లో చోటు చేసుకుంది. ఫిలింనగర్లోని స్వామి వివేకానందనగర్లో నివాసం ఉంటున్న బన్నప్ప అనే వ్యక్తి ఇంట్లో బుధవారం ఉదయం సిలిండర్లోని గ్యాస్ లీకయింది.
దీంతో మంటలు చెలరేగడంతో ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఫిలింనగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో ఇంట్లోని కొన్ని సామాన్లు దగ్దమయ్యాయి.