సాహితీవేత్తలకు స్పూర్తిదాయకం కోవెల: డాక్టర్ కె.వి రమణాచారి

తెలుగుయూనివర్సిటీ: ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య నేటి తరం సాహితీవేత్తలకు స్పూర్తిదాయకమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య స్మారకోపన్యాసం వర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రమణాచారి మాట్లాడుతూ సంపత్కుమారాచార్య సాహిత్యమే జీవితంగా కొనసాగించారన్నారు. నిరాడంబరుడైన ఆయన సాహిత్యలోకంలో విహరింపజేశారని పేర్కొన్నారు. పద్య కవిత్వంలో, సాహిత్యంలో పరిశోధనకు ఆయన స్పూర్తిని కలిగించారని రమణాచారి గుర్తు చేశారు. సంపత్కుమారాచార్య సాహితీవేత్తనే కాదు సంఘసంస్కర్త కూడా అని తెలిపారు.
వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య టి. కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణరావు పాల్గొని సంపత్కుమారాచార్య పద్యాలు-ప్రయోగాలు అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. రహదారులు,భవనాల శాఖ పూర్వ పర్యవేక్షక ఇంజనీర్ డి. లక్ష్మణాచార్యులు, విస్తరణ సేవా విభాగం ఇంచార్జి రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

