చాదర్‌ఘాట్: మలక్‌పేటలోని పాకో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ టెక్నికల్ డైరెక్టర్ ఇఫ్తేకార్ స్సేన్‌కు ఉత్తమ కోచ్ అవార్దును జాతీయ సంఘీభావ కమిటీ ప్రకటించింది. యువతీ, యువకుల్లో స్వీయ రక్షణతో పాటు, ఆత్మస్థెర్యం పెంపొందించే విధంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తుండడంతో ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కమిటీ ప్రకటించింది.
నగరంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అఫ్జలుద్దీన్ చేతుల మీదుగా ఇఫ్తేకార్ స్సేన్ కు అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా ఇఫ్తేకార్ హస్సేన్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించడం వలన ఆత్మస్థెర్యంతో పాటు వారి శారీరక దృడత్వానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవార్డు రావడం పట్ల ఇఫ్తేకార్ స్సేన్ సంతోషం వ్యక్తం చేశారు.