Osmania hospital | కార్పొరేట్‌కు దీటుగా ఉస్మానియాలో మెరుగైన వైద్యం : డాక్టర్ శశికళారెడ్డి

సుల్తాన్‌బజార్ : ఉస్మానియా దవాఖానలో కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన వైద్యం అందుతుందని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశి కళా రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా దవాఖాన బయో కెమిస్ట్రీ విభాగంలో 60 లక్షల రూపాయల విలువ చేసే అత్యాధునిక అల్ట్రా మోడ్రన్ క్లినికల్ కెమిస్ట్రీ ఆటో అనలైజర్ యంత్రాన్ని ఆమె సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్‌తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న వైద్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని పటిష్టం చేస్తూ ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అందించేందుకు అన్ని విధాలా సహకరించడం అభినందనీయమన్నారు.

సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ మాట్లాడుతూ ఈ యంత్రం ఏర్పాటుతో రోగులకు త్వరిత గతిన అన్ని రకాల రక్త పరీక్షలు చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. రోజుకు 400 పరీక్షలను ఈ యంత్రం చేస్తుందని తద్వారా రోగులకు మరింత తొందరగా వైద్య సేవలు అందించేందుకు వీలుంటుదన్నారు. రోగి వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు శస్త్ర చికిత్సల కంటే ముందు ఈ రక్త పరీక్షలు ఎంతో అవసరమని అన్నారు. టీఎస్ఎంఐడీసీ సహకారంతో ఏర్పాటైన ఈ యంత్రంతో పేద రోగులకు ఎంతో మేలు అని అన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

