పలువురికి కళామానస పురస్కారాల ప్రదానం

ముషీరాబాద్ :మానస ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం, వివిధ రంగాల ప్రముఖులకు కళామానస పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. సోమవారం గానసభ కళాసుబ్బారావు కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత భాషాసాహిత్య సమ్మేళన్ అధ్యక్షుడు ఆచార్య కడారు సత్యమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారికి కళామానస పురస్కారాల ప్రదానం చేశారు.
బహుభాషా కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను సత్కరించారు. జీవిఆర్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుదిబండి వెంకటరెడ్డి, కవి గట్టుపల్లి సీతారామరావు, డాక్టర్ నర్మదారెడ్డిలు కళామానస పురస్కారాలను అందుకున్నారు. సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి, కెనరా బ్యాంక్ విశ్రాంత ఎజిఎం ఐవి.రావు, మానస ఆర్ట్స్ సంస్థ అధ్యక్షుడు బి.రామచందర్‌రావు, ఉపాధ్యక్షుడు లలితవాణి, కార్యదర్శి రఘుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

