‘ఆద్య కళా’ అద్భుతం : ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు

కొండాపూర్ : గత చరిత్రతో పాటు నాటి సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేసేలా ఆద్య కళా ప్రదర్శన ఆకట్టుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు బీవీ పాపారావు అన్నారు. శుక్రవారం ఆయన మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీల సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న ఆద్య కళా ప్రదర్శనను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆద్య కళా ప్రదర్శనలో ఆది వాసీలు, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సంగీత వాయిద్యాలు, వారి చరిత్రకు నిలువుటద్దంలా అనేక పరికరాలు, వస్తువులు, దేవతా మూర్తుల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. భవిష్యత్తు తరాలకు పూర్వ వైభవాలను తెలియజేసేలా ఉన్నాయన్నారు.
ప్రదర్శనలో ఉంచిన వస్తువులను పదికాలల పాటు భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయడం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీ, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

