కొండెక్కిన చికెన్ ధరలు

కోడి కొనలేం..గుడ్డు తినలేం..
కిలో చికెన్ ధర 259, గుడ్డు రూ.5
చుక్కలు చూపిస్తున్న రేట్లు
ఆందోళనలో మాంసం ప్రియులు
ఇంకా ధరలు పెరుగుతాయంటున్న వ్యాపారులు
సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్4 : పండుగలకు పబ్బాలకు, ఆదివారం వస్తే అలవాటుగా చాలా మం ది నాన్ వెజ్ తిందామనుకుంటారు. కానీ ధరలు పెర గడంతో సామాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే భయ పడుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో ఎన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర ఒక్కసారిగా రూ.259కి పెరి గింది. పదిరోజుల క్రితం కిలో రూ.190 ఉన్న ధర ఒక్కసారిగా రూ.70 పెరిగి ఇప్పుడు 259కు చేరింది. పోని గుడ్డుతోనైనా సరిపెట్టుకుందామంటే అది కూడా రూ.5కు చేరింది. దీంతో కొండెక్కిన చికెన్ ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపి స్తున్నాయి.దీనికి తోడు కూరగాయలు, పప్పుల ధరలు కూడా పెరగడంతో ఏం తినేటట్టు లేద ని ప్రజలు వాపోతున్నారు. కొవిడ్ వైర స్, బర్డ్‌ఫ్లూ ప్రభావంతో చికెన్ వినియో గం కొంతకాలంగా 50-60 శాతం వర కు పడిపోయి ఒక దశలో కిలో వందకే లభించింది. వినియోగం పెరగడం, ఎండలు మండిపోతుండడంతో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని అందుకే ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతు న్నారు.వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీ ఫాముల్లో కోళ్లు చని పోవడం, ఎండల తీవ్రత పెరగడం వల్ల చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీయజమానులు అంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో కిలో చికెన్ ధర 300 వరకు వెళ్లే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఇలా అయితే చికెన్ తినడం కష్టమే అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకనే
కొవిడ్, బర్డ్ ప్లూ ప్రచారంతో పౌల్ట్రీ యజమానులు చాలా వరకు కోళ్ల ఉత్పత్తిని నిలిపివేశారని, అందువల్లే ఇప్పుడు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోతున్నా మని పౌల్ట్రీయజమానులు చెబుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండటంతోనే ధరలు పెరుగుతున్నాయని ఈనెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని కోళ్ల దా ణా ధరలు, నిర్వహణ వ్యయం పెరగడంతో పాటు వ డగాలుల తీవ్రతకు పౌల్ట్రీల్లో కోళ్లు చనిపోవండంతో చికెన్ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశ ముంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
వ్యాపారం తగ్గిపోయింది..
రేట్లు పెరగడంతో జనాలు చికెన్ కొనడానికి ఆసక్తి చూ పడంలేదు. చికెన్ ధరకు 100 కలిపితే ఆఫ్ కేజీ మట న్ వస్తుందని అంటున్నారు. గతంలో వారానికి 20 క్విం టాళ్ల చికెన్ వ్యాపారం జరిగే ది. రేట్లు పెరగడంతో 10క్వింటాళ్లు కూడాఅమ్మడం లేదు. రేట్లు పెరగడంతో వ్యాపారం చాలా తగ్గిపో యింది. -నజీముద్దీన్, చికెన్ షాప్ నిర్వాహకుడు
అర కిలో మాత్రమే తీసుకున్నా
ప్రతి ఆదివారం మటన్ కానీ చికెన్ కానీ తినడం అలవా టు. మటన్ రేటు పెరగడంతో చికెన్ తీసుకునేవాడిని. పెద్ద కుటుంబం కావడంతో కిలో చికెన్ కచ్చితంగా తీసు కోవాల్సి వచ్చేది. రేట్లు పెరగడంతో అరకిలో మాత్రమే తీసు కెళ్తున్నా. ఇలాగే రేట్లు పెరిగితే మాంసం తినడం కం టే మానేయడమే మంచిది
-రాసాల గాలయ్య, సంస్థాన్ నారాయణపురం
ఇవి కూడా చదవండి
వేదాంత కెయిర్న్‌తో జగడం.. లాభాల రికవరీకి కేంద్రం నోటీసు
మల్లన్నా.. మొక్కులు అందుకో..
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

