సికింద్రాబాద్ : మానవమృగాలు రెచ్చిపోతున్నారు. అభం, శుభం తెలియని పసిపాపల నుంచి బాలురను సైతం కామ వాంఛతో చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా కొంతమంది మృగాళ్లు వికృత చేష్టలకు తెగబడుతున్నారు.
ఈ క్రమంలోనే చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్శిగుట్ట రాఘవ గార్డెన్స్ సమీపంలో బాలుడిపై లైంగికదాడి జరిగిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రాఘవ గార్డెన్స్ సమీపంలో నివాసముండే తెల్ల రామేశ్వర్‌రావుకు కుమారుడు (మైనర్ బాలుడు) ఉన్నాడు.
ఇంటి ముందర బాలుడు ఆడుకుంటున్న సమయంలో పార్శిగుట్టలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న గుళ్ల సతీష్ (23) మాయ మాటలు చెప్పి రాఘవ గార్డెన్స్ సమీపంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.
సదరు విషయాన్ని బాలుడు. తండ్రికి తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు విచారణ చేపట్టి గుళ్ల సతీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.