కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేయాలి

వర్ధన్నపేట, ఏప్రిల్ 16: ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేయాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో వర్ధన్నపేట ఎస్సై వంశీకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ గొడిశాల రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. మాస్కులు ధరించకపోతే రూ.వేయి వరకు పోలీసు అధికారులు జరిమానా విధిస్తారన్నారు. ప్రజలు ఇప్పటికైనా కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ముప్పు : ఏసీపీ
రాయపర్తి: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేశ్ సూచించారు. శుక్రవారం మండలంలోని మైలారం గ్రామంలో ఎస్సై పింగిళి నాగరాజు నేతృత్వంలో పోలీసులు ‘గ్రామస్తులు కరోనా నిబంధనలు-మాస్కు, భౌతిక దూరం, పాటించాల్సిన ఆవశ్యకత’పై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రతిరోజూ దేశంలో వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, అత్యవసర సమయాల్లో తప్ప ఆరుబయట ఎట్టి పరిస్థితుల్లో సంచరించవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లేతాకుల సుమతి, ఎంపీటీసీ గాడిపల్లి వెంకన్న, పోలీస్ సిబ్బంది సదయ్య, సురేశ్, ఎడ్ల రవీందర్, మహేందర్, లక్ష్మణ్, అన్వేష్, బొట్ల రాజు, చిదురాల రమేశ్, కత్తుల శ్రీనివాస్, రవి, గొళ్లెన రమేశ్, పూర్ణచందర్‌రెడ్డి, సోమ్లానాయక్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి
దామెర: కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు పాటించాలని దామెర తహసీల్దార్ రియాజొద్దీన్ శుక్రవారం కోరారు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని, 45 సంవత్సరాలు పైబడినవారు స్థానిక పీహెచ్‌సీల్లో తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చినప్పుడు శానిటైజర్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొన్నారు. మండలంలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
నీరవ్ మోదీ అప్పగింతకు బ్రిటన్ హోంమంత్రి గ్రీన్ సిగ్నల్
హల్దీ ప్రాజెక్టు మత్తడి దూకడం అద్భుతం : మంత్రి హరీశ్ రావు
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

