Video recording | ఇంటర్నెట్ మరమ్మతుల కోసం వచ్చి..

బంజారాహిల్స్ : ఇంటర్నెట్ మరమ్మతులు చేసేందుకు వచ్చి ఓ మహిళ స్నానం చేస్తున్న వీడియోను తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లెపల్లి సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన కే.మార్టిన్ (19) బంజారాహిల్స్‌లోని యాక్ట్ ఫైబర్ నెట్ సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఓ అపార్ట్మెంట్లో ఇంటర్నెట్ సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు రావడంతో మంగళవారం మధ్యాహ్నం అక్కడకు వెళ్లాడు. రోడ్డుమీద ఉన్న స్థంభానికి నిచ్చెన పెట్టి కేబుల్స్ పరిశీలిస్తున్న మార్టిన్ పక్కనే ఉన్న ఇంట్లో ఓ మహిళ (45) బాత్రూమ్లో స్నానం చేస్తున్న విషయాన్ని గమనించాడు.
దాంతో తనవద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో వీడియో రికార్ట్ చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ అప్రమత్తమయి ఇంట్లోనే ఉన్న భర్తకు చెప్పింది. దాంతో బయటకు వచ్చిన బాధితురాలి భర్త స్థానికుల సాయంతో నిందితుడు మార్టిన్‌ను పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

