శంషాబాద్ రూరల్ : శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పార్కింగ్ వద్ద గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ చోట్ల జప్తుచేసిన, ప్రమాదాలు జరిగిన వాహనాలను పార్కింగ్ చేసిన స్థలంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు వెంటనే స్పందించి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పెద్దగా ఆస్తినష్టం జరగలేదని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.