Ganesh Chaturthi 2023 | గణేశుడికి గరిక అంటే ఎందుకంత ఇష్టం?
Ganesh Chaturthi 2023 | దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు.
Ganesh Chaturthi 2023 | దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. పురాణాల ప్రకారం.. అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.
స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. పద్మాలను సమర్పించారు, పుష్పార్చనలు చేశారు. ఏకంగా చంద్రుణ్ని తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు. అయినా గణపతికి వేడి తగ్గలేదు. చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడి శిరస్సుపై ఉంచాడు. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి, గడ్డిపోచకూ లంకె కుదిరింది. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ, సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన. అందుకే దూర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై, శీఘ్ర ఫలితం ఇస్తాడని విశ్వసిస్తారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

