వినోద, హైదరాబాద్ ఇంటిని శుభ్రంగా ఉంచడంలో చీపురు కీలకంగా వ్యవహరిస్తుంది. ఇల్లు, వాకిలి శుభ్రంగా ఉన్న ఇంట మహాలక్ష్మి కొలువుదీరి ఉంటుందని పెద్దల మాట. ఈ క్రమంలో మన ఇంటిని లక్ష్మీనివాసంగా మార్చే సాధనమైన చీపురును శ్రీలక్ష్మిగా భావిస్తారు.
చీపురును పడుకోబెట్టరాదని, నిలబెట్టాలని చెప్పడం వెనుక ఆంతర్యం కూడా ఇదే! ఇక చీపురును ఏ మూలన ఉంచాలన్నది విచక్షణతో తీసుకోవాల్సిన నిర్ణయం. నలుగురికీ కనిపించేలా కాకుండా, తలుపు చాటునో, బాల్కనీలోనో ఉంచడం మంచిది. ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మనసు పరమాత్మ తత్వానికి చేరువ అవుతుంది. ఈ ప్రక్రియలో చీపురు దోహదం చేస్తుంది.