Yogi | నిజమైన యోగి ఎవరు?
Yogi | మనం చూస్తున్నవి అన్నీ ప్రతిబింబాలే, వాస్తవాలు కావు. ఆకారాన్ని బట్టి, నిర్మాణశైలిని బట్టి ఆభరణాలు వేర్వేరుగా కనిపించవచ్చు! కానీ, మూలం బంగారం ఒకటే. అలాగే అన్ని జీవరాశుల్లో, ప్రతి వస్తువులో ఉన్నది పరమాత్మ తప్ప మరొకరు కాదు. ఈ సత్యం మనసులో స్థిరంగా ఏర్పడినప్పుడే ‘సమదృష్టి’ ఏర్పడుతుంది. ఈ సమత్వ భావన పొందడాన్నే యోగం అంటుంది భగవద్గీత.
ఎలాంటి వికారాలు లేకుండా మనసు నిర్మలమై సమత్వ భావం పొందినప్పుడు రాగద్వేషాలు తొలగిపోతాయి. తద్వారా కర్మలపై ఆసక్తి నశిస్తుంది. ఫలితంగా మోహం ఏర్పడదు. అప్పుడు కర్మలు ఆచరిస్తున్నా.. కర్మఫలాన్ని పొందడం ఉండదు. ఈ స్థితికి చేరినవాడే నిజమైన యోగి. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా.. ఇంద్రియ భోగాలపై ఆసక్తిని వదిలిపెట్టినవాడే యోగాన్ని సాధించగలడు. అన్ని దిశల నుంచి వచ్చి చేరే నదులు సముద్రాన్ని ఎలాగైతే చలింపలేవో, అలాగే ఇంద్రియ నిగ్రహం సాధించిన యోగిని భోగాలు ప్రభావితం చేయలేవు. ఈ స్థితిని పొందిన సాధకులు జ్ఞానులను, అజ్ఞానులను, సమస్త జంతుజాలాన్నీ, మానవాళినీ సమంగా చూస్తారు. ‘పండితాః సమదర్శినః’ అన్న గీతావాక్యం వారి విషయంలో అక్షర సత్యం.
– శ్రీ
Read More :
సనాతన ధర్మాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నలుదిక్కులా ఎలా విస్తరింపజేశారు?
Tambulam | ఏ సందర్భాల్లో తాంబూలాలు ఇస్తారు.. వాటి ప్రత్యేకత ఏంటి?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- devotional
- Yoga
- yogi
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

