Tulsi puja | తులసి అంటే అర్థం ఏంటి? కార్తీక మాసంలో ఈ చెట్టును ఎందుకు పూజించాలి?
Tulsi puja | కార్తిక మాసంలోని పర్వదినాల్లో ప్రముఖమైనది క్షీరాబ్ధి ద్వాదశి. ఆ రోజు సమస్త దేవతలు, రుషులు క్షీరసాగరానికి చేరుకొని యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరిని ఆరాధిస్తారు. ఇంతటి పావనమైన రోజు కావడంతో దీనిని పావన ద్వాదశి అంటారు. ఇదే రోజున క్షీరసాగరాన్ని చిలికిన కారణంగా క్షీర ద్వాదశి, చిలుకు ద్వాదశి అని అంటారు. యోగులు, మునులు చాతుర్మాస్య దీక్ష విరమించే రోజు కావడంతో యోగీశ్వర ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న క్షీరాబ్ధి ద్వాదశి విశేషాలెన్నో..

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి జారుకుంటాడు. దీనిని శయన ఏకాదశి అంటారు. మళ్లీ కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ద్వాదశి నాడు లక్ష్మీదేవి సమేతంగా తులసి వనానికి విచ్చేసి, తులసితో కలిసి పూజలు అందుకొని తన భక్తులను అనుగ్రహిస్తాడు శ్రీహరి. తులసిని పెరటి వైద్యుడు అంటారు. అనేక ఔషధ గుణాలు తులసి సొంతం. తులసి అంటే పోల్చలేనిది అని అర్థం. ఈ మొక్కను పూజించడం అంటే అందులోని దైవత్వాన్ని, అమృతత్వాన్ని గుర్తించడమే!
క్షీరాబ్ధి ద్వాదశి నాడు ఆచరించే వత్రం ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడు మొదలవుతుంది. నాటి నుంచి నెల రోజులు విష్ణుమూర్తిని, తులసిని అర్చన చేస్తూ, కార్తిక శుద్ధ ఏకాదశి నాటికి పూర్తి చేస్తారు. ఏకాదశి నాడు ఉపవాసం పాటించి, ద్వాదశి రోజు కూడా పగలంతా ఏమీ తినకుండా ఉంటారు. సూర్యాస్తమయం సమయంలో ఇంటి ముందు, తులసి కోట దగ్గర పదుల సంఖ్యలో దీపాలు వెలిగిస్తారు. ఉసిరి కొమ్మను తులసికోటలో నాటి, రెండిటికీ కల్యాణం చేస్తారు. ఉసిరి అంటే ధాత్రి. అంటే ధరించేది అని అర్థం. జ్ఞానాన్ని, బుద్ధిని ధరించేది, అజ్ఞానాన్ని తొలగించేది. అంటే సాక్షాత్తు నారాయణుడే! ఉసిరి కొమ్మను నారాయణుడిగా, తులసిని లక్ష్మీదేవిగా భావించి కల్యాణం నిర్వహిస్తారు. తర్వాత క్షీరాబి ద్వాదశి కథ పఠిస్తారు. క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం ఆచరించిన వారికి మోక్షం సంప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతున్నది.
– వేముగంటి శుక్తిమతి, 99081 10937
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

