బుద్ధితో పయనించు
ధీ + యానం = ధ్యానం! ధీ అంటే బుద్ధి. యానం అంటే ప్రయాణం. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానం. బుద్ధితో మనుగడ సాగిస్తే జీవితంలో స్వార్థానికి చోటుండదు. కోపాలకు, తాపాలకు తావుండదు. ధ్యానం చేయడం అంటే యజ్ఞం చేసినంత కష్టపడాల్సిన పనిలేదు.
ధీ + యానం = ధ్యానం! ధీ అంటే బుద్ధి. యానం అంటే ప్రయాణం. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానం. బుద్ధితో మనుగడ సాగిస్తే జీవితంలో స్వార్థానికి చోటుండదు. కోపాలకు, తాపాలకు తావుండదు. ధ్యానం చేయడం అంటే యజ్ఞం చేసినంత కష్టపడాల్సిన పనిలేదు. హాయిగా సుఖాసనంలో కూర్చొని, రెండు చేతులు కలిపి, చేతి వేళ్లు జోడించి.. సహజంగా సాగే శ్వాసక్రియపై దృష్టి సారించడమే! మనలో జరుగుతున్న ఉఛ్వాస, నిశ్వాసలను ఏకధారగా గమనించాలి. మధ్యలో మనసులో ఆలోచనలు వస్తుంటాయి. వాటిని వదిలేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. కొన్నాళ్ల సాధన తర్వాత ఓ రోజు మనసు ఆలోచనా రహిత స్థితిలోకి చేరుకుంటుంది. దాంతో ఆధ్యాత్మిక అవగాహన మొదలవుతుంది. గౌతముడు ధ్యాన సాధనతోనే బుద్ధుడిగా అవతరించాడు. ఆ ధ్యానమే సుమారు 2,500 ఏండ్ల కిందట బుద్ధుడు ఆచరించిన ‘ఆనాపానసతి’. ‘ఆన’ అంటే లోపలికి వెళ్లే శ్వాస. ‘అపాన’ అంటే బయటికి వచ్చే గాలి. ‘సతి’ అంటే వాటితో కలిసి ఉండటం.
‘పని చేస్తుంటే పని మీద ధ్యాస – పని లేకుంటే శ్వాస మీద ధ్యాస’ అని బ్రహ్మర్షులు పేర్కొన్నారు. అంటే పని మీదే పూర్తి ధ్యాస పెట్టడంతో మీకు ఏ ఆలోచనలూ ఉండవు. మీరు చేస్తున్న పనిలో మీ నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించగలుగుతారు. పనిలేకుంటే శ్వాస మీద ధ్యాసతో అనవసరపు ఆలోచనలు మీ దరికి చేరవు. ధ్యానంతో అక్కరకు రాని సమాచారాన్ని వడబోసే సామర్థ్యం పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాలు స్పష్టమైనవిగా ఉంటాయి. బుద్ధి వికసిస్తుంది. జీవన సౌందర్యం అవగతం అవుతుంది. దైవీశక్తి విశిష్టత తెలుస్తుంది. మనిషిని క్షణక్షణం వెంటాడే మరణ భయం కూడా మాయమైపోతుంది. అతీతమైన స్థితికి చేరిన మనిషికి చివరికి మిగిలేది అనంతమైన తృప్తి. అచంచలమైన విశ్వాసం. ఈ రెండూ సాధించిన మానవ జన్మ ధన్యమని అనకుండా ఉండలేం!
మనసు ఆలోచనా రహిత స్థితికి చేరుకోవడమే ధ్యానం! అందుకు తేలికైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి సంకీర్తనం. నవ విధ భక్తి మార్గాల్లో శ్రవణం, కీర్తనం ఈ కోవకే చెందుతాయి. భగవత్ కథలు, కీర్తనలు వింటున్నప్పుడు తెలియకుండానే అందులో లీనమవుతాం. స్వామిలీలలే కండ్ల ముందు కదలాడుతుంటాయి. దేవుడి రూపం మనోఫలకంపై నిలుస్తుంది. కీర్తనం కూడా అంతే! పది మందీ కలిసి భజన చేస్తుంటే అయాచితంగా మనసు భజనపై లగ్నం అవుతుంది. ఉత్సాహంతో చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి అలౌకిక ఆనందంలో విహరిస్తాం. ప్రాథమికంగా ఈ మార్గాలను ఎంచుకొని, ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి. ఒక దశ దాటిన తర్వాత నిశ్చలమైన ధ్యానంపై మనసు కేంద్రీకృతం అవుతుంది. ఆపై జీవన యానం సద్బుద్ధి పూర్వకంగా సాగుతుంది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

