చారుమతి కథ
భారతీయ ఆధ్యాత్మికతలో పండుగల ప్రాధాన్యం ప్రత్యేకమైంది. ఒక్కో పండుగ ఒక్కో రకమైన శోభను చేకూరుస్తుంది. మానసిక ఉల్ల్లాసాన్ని ఇస్తూ, ఇంటికి కొత్త అందాలను తెచ్చిపెడుతుంది.
భారతీయ ఆధ్యాత్మికతలో పండుగల ప్రాధాన్యం ప్రత్యేకమైంది. ఒక్కో పండుగ ఒక్కో రకమైన శోభను చేకూరుస్తుంది. మానసిక ఉల్ల్లాసాన్ని ఇస్తూ, ఇంటికి కొత్త అందాలను తెచ్చిపెడుతుంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని తిథి నక్షత్రాలతో సంబంధం లేకుండా
వరలక్ష్మీ వ్రతంగా జరుపుకొంటారు. అత్యంత శక్తిమంతమైన వ్రతాలలో వరలక్ష్మీ వ్రతం ఒకటని అంటారు. ఇందులో భాగంగా.. చారుమతి కథను భక్తిగా చెప్పుకొంటారు.
వరలక్ష్మి కటాక్షాన్ని పొందిన మహిళ పేరు అది. చారుమతి అంటే.. మంచి బుద్ధి కలిగినది, మితభాషి అని అర్థం. వ్రతాలను ఆచరించడానికి అందరూ అర్హులేననీ, సామూహికంగా ప్రార్థిస్తే.. ఎక్కువ ఫలితం ఉంటుందనే సామాజిక స్పృహ కలిగిన మహిళ చారుమతి. కుటుంబ ధర్మాన్ని, గృహిణి బాధ్యతలను ఆమె నిర్వర్తించిన తీరు ఆదర్శవంతం.
లక్ష్మీ కటాక్షంలో స్త్రీ పాత్రే కీలకమని పురాణాలు చెబుతున్నాయి. అత్తమామలను ఆదరించే కోడలున్న ఇంట శ్రీలక్ష్మి కొలువై ఉంటుంది. భర్తను గౌరవిస్తూ అతనికి మంచిని సూచించే భార్య నిజమైన గృహలక్ష్మి. భార్యాభర్తలు కీచులాడుకోని ఇంట్లో వరలక్ష్మి స్థిరంగా ఉంటుందని భాగవతం పేర్కొన్నది.
చారుమతి కథను అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకుంటే ఇంటిదీపం ఇల్లాలే అవుతుంది. ఆమెలోని సద్గుణాలు అలవరచుకొంటే వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది. చెడుబుద్ధి, దుష్ట సంకల్పం, దుర్గుణాలు లేని స్వచ్ఛమైన మనసు కలిగినవారే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఇంటికి ఇల్లాలే.. వరలక్ష్మి. ఆమెను గౌరవించడం, అర్థం చేసుకోవడం, ఆమె శ్రమలో భాగం పంచుకోవడం భర్త బాధ్యత కూడా.
...? వేమూరి శ్రీనివాస్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

