TTD | శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. 20న ఆర్జిత సేవల టికెట్లు విడుదల
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన టికెట్లను ఒకేసారి బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండగా.. టికెట్లు బుక్ చేసుకునేందుకు మూడు రోజుల పాటు గడువు ఇచ్చింది.
ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లను కేటాయించనుండగా.. ఈ నెల 22న టికెట్లు పొందిన భక్తుల వివరాలను పంపనున్నది. సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం సేవలకు సంబందిచిన టికెట్లు విడుదల చేయనున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చిలో ఆయా సేవలను దేవస్థానం నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు సేవలను పునరుద్ధరిస్తున్నది.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Arjitha Seva
- Tickets
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

