సీతమ్మ పలికిన.. హనుమద్ మంత్రం
ఈ శ్లోకం వాల్మీకి రామాయణం సుందరకాండలోనిది. ‘హనుమా! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడవు నువ్వే!’ అని తనకు రాముడి అభిజ్ఞాన్ని అందించిన హనుమంతుడితో చెబుతుంది సీతమ్మ. ఇది కార్యసిద్ధి హనుమాన్ మంత్రంగా ప్రసిద్ధికెక్కింది.
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ॥
ఈ శ్లోకం వాల్మీకి రామాయణం సుందరకాండలోనిది. ‘హనుమా! నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడవు నువ్వే!’ అని తనకు రాముడి అభిజ్ఞాన్ని అందించిన హనుమంతుడితో చెబుతుంది సీతమ్మ. ఇది కార్యసిద్ధి హనుమాన్ మంత్రంగా ప్రసిద్ధికెక్కింది.
రామాయణంలో మంథర, శూర్పణఖ పాత్రలు కీలక పరిణామాలకు కారణమైనవి. మంథర దుర్బోధ వల్ల కైకేయి సాధించిందేమీ లేకపోగా భర్తను కోల్పోయింది. విధవగా శేషజీవితాన్ని గడిపింది. దురాశకు పోయిన శూర్పణఖ దుర్బోధ వల్ల రావణాసురుడు తన ప్రాణాలు కోల్పోవడంతోపాటు లంక సర్వనాశనానికి కారకుడయ్యాడు. దుర్భరమైన వియోగదుఃఖాన్ని అనుభవించినప్పటికీ సీతారాములు పరస్పర ప్రేమను, మానసిక ైస్థెర్యాన్ని కోల్పోలేదు. సీతమ్మ కోసం వనమంతా గాలిస్తూ రాముడు శోకిస్తే.. అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య అనుక్షణం రాముణ్ని తలుచుకుంటూ దుఃఖించింది సీతమ్మ. ఆ మహా ఇల్లాలిని అన్వేషిస్తూ అశోకవనం చేరుతాడు హనుమంతుడు. రాముడు తనకు ఇచ్చిన అంగుళీయకాన్ని సీతమ్మకు అందించాడు. ‘సీతమ్మ తల్లీ! శ్రీరామచంద్రుడు లంకకు తప్పకుండా వస్తాడు. రావణ సంహారం గావించి మిమ్మల్ని తీసుకెళ్తాడు’ అని భరోసా కల్పిస్తాడు. ఆ సందర్భంలో సీతమ్మతల్లి పై శ్లోకం పలికింది.
దంపతుల ఎడబాటుకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కారకులైన వారికి బ్రహ్మహత్యా పాతకం తగులుతుందని భాగవతం పేర్కొంది. ఆధునిక కాలంలో సైతం తాత్కాలిక ఆకర్షణలకు లోనవుతూనో, ఇతరుల దుర్బోధల ప్రభావంతోనో దాంపత్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు సీతావియోగ ఘట్టం నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. రాక్షసమాయలు, కుయుక్తులు తాత్కాలిక దుఃఖాన్ని వియోగాన్ని కలిగించినా.. దైవశక్తి విజృంభణ ముందు అవి నిలబడలేవు. అంతిమంగా ధర్మమే జయిస్తుంది. ధర్మాన్ని పట్టుకోవడమే మనం చేయాల్సింది. హనుమతో సీతమ్మ పలికిన మాటలు కార్యసిద్ధి మంత్రంగా మారాయి. ఆపత్కాలంలో, నిత్య విధిలో పై శ్లోకాన్ని యథాశక్తి పఠించినవారికి కార్యసిద్ధి కలుగుతుంది.
…?డా॥ చెప్పెల హరినాథశర్మ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

