ఈ నాలుగు ఉత్తమ దానాలు
దానానాంచ సమస్తానామ్ చతుర్వేతాని భూతలే శ్రేష్ఠాని కన్యా గో భూమి విద్యాదానాని సర్వదా॥
దానానాంచ సమస్తానామ్ చతుర్వేతాని భూతలే
శ్రేష్ఠాని కన్యా గో భూమి విద్యాదానాని సర్వదా॥
కన్యాదానం, గోదానం, భూదానం, విద్యాదానం ఈ నాలుగింటినీ అత్యున్నత దానాలుగా పేర్కొన్నాయి మన శాస్ర్తాలు. కన్యాదానం వల్ల ఒక కుటుంబం ఏర్పడుతుంది. భూదానం, గోదానం వల్ల కుటుంబానికి అవసరమైన పాడిపంటలు సమకూరుతాయి. విద్యాదానం వల్ల అజ్ఞానం అంతరించి, జీవన విధానానికి దారి దొరుకుతుంది. ఇవే కాకుండా దశ దానాలనీ, షోడశ దానాలనీ కూడా ఉన్నాయి.
మరి ఇన్ని దానాలలో చేర్చనిదీ, ఆర్తులకు ఆకలిని తీర్చేది అన్నదానం. దీనులకు సాయపడటాన్ని ‘దానం’ అని అభివర్ణించారు. కాబట్టి పైన పేర్కొన్న అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని పెద్దల మాట. మరణభయంతో విలవిల్లాడే వాడికి అభయం ఇవ్వడం, వ్యాధిగ్రస్తుడికి సరైన చికిత్స అందించడం, విద్యాభిలాషికి విద్యాదానం చేయడం, ఆకలితో ఉన్నవానికి అన్నదానం చేయడం… ఈ నాలుగూ చతుర్విధ ఉత్తమ దానాలు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

