త్రిగుణాలకు ప్రతీకలు

దీపారాధనలో ఎన్ని వత్తులు ఉంచాలి? ప్రత్యేకంగా ఈ దైవానికి ఇన్ని వత్తులు వేయాలనే నియమం ఏమైనా ఉన్నదా? – ప్రసన్న, మెదక్
శ్లో॥ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్ ఘోరాద్దివ్య జ్యోతిర్నమోస్తుతే॥
అని పఠిస్తూ నిత్యపూజలో దీపాన్ని వెలిగిస్తారు. ముందుగా దీపారాధన పూజల్లో ప్రధానమైన ప్రక్రియ. దేవుడికి సమర్పించే దీపంలో మూడు వత్తులు ఉండాలని పైశ్లోకం వివరిస్తుంది. ఈ మూడు వత్తులు ముల్లోకాలకూ, సత్వ, రజో, తమో గుణాలకూ, త్రికాలాలకూ సంకేతంగా చెబుతారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం అని భావం. ‘ఓ దైవమా! మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. నీకు ఎంతో ఇష్టమైన నేతితో కూడిన మూడు వత్తులతో కూడిన దీపమిది. దీన్ని అగ్నితో వెలిగించి భక్తితో నివేదిస్తున్నాను. ఈ దీపాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు. నరకం నుంచి రక్షించగలిగిన దైవ స్వరూపమూ, మహిమాన్వితమూ అయిన ఈ జ్యోతికి నమస్కరిస్తున్నాను’ అని ఈ ప్రార్థన భావం. పండుగ రోజులలో మాత్రం కుటుంబ సంక్షేమం కోసం స్త్రీలు వెలిగించే దీపానికి ఐదు వత్తులుండాలని ఒక విశ్వాసం ఉంది. కానీ, దేవతల రూపాలను అనుసరించి వత్తుల సంఖ్యలో మార్పులుండాలనే నియమమేదీ లేదు. దీపంలో మూడు వత్తులు వేయాలనేదే శాస్త్ర ప్రమాణం.
డా॥ శాస్ర్తుల
రఘుపతి
73867 58370
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

