Sri Rama Navami | భద్రాద్రి ఆలయంలో వైభవంగా తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
Sri Rama Navami | భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి.
Sri Rama Navami | భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. మిథిలా మైదానంలో వైభవోపేతంగా సాగుతున్న సీతారాముల కల్యాణం.. మిథిలా మండపంలో సీతారాముల కోసం కల్యాణ మండపం ముస్తాబైంది. కల్యాణం తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాద్రికి భక్తులు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ముత్యాల తంబ్రాలను సైతం సమర్పించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు స్వామివారి కల్యాణ క్రతువు సాగనున్నది. అభిజిత్ లగ్నంలో జరగనున్న సీతారాముల కల్యాణం జరుగనున్నది. స్వామివారి కల్యాణానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ముత్యాల తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వేల మంది పోలీసులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు కల్పించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా క్యూఆర్ కోడ్‌తో భక్తులకు దిశానిర్దేశం చేశారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

