బాధ్యత తెలిపే రక్షా బంధనం
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది.
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది. ఈ సమరంలో దేవతల గెలుపు కోరి శ్రావణ పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి.. శచీదేవి తన భర్త దేవేంద్రుడికి రక్షాబంధం కడుతుంది. ఆ రక్ష ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో గెలుస్తాడు. ద్వాపర యుగంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపదీదేవి తన చీర చెంగును చింపి రక్ష కడుతుంది. ఆ రక్షే తర్వాత వస్ర్తాపహరణ ఘట్టంలో ద్రౌపదికి రక్షణగా నిలిచిందన్న కథ కూడా ప్రచారంలో ఉంది.
ఇక చారిత్రక అంశాలను పరిశీలిస్తే.. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భార్య రోక్సానా తన భర్త మేలు కోరి భారత ఉపఖండం వాయవ్య భాగాన్ని పాలిస్తున్న రాజు పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. సోదరి సౌభాగ్యం కోరి పురుషోత్తముడు అలెగ్జాండర్‌ను ప్రాణాలతో విడిచిపెట్టాడని చెబుతారు. ఇలా రక్షాబంధనం వెనుక అనేకానేక కథలు ప్రచారంలో ఉన్నాయి. లౌకికంగా ఆలోచిస్తే.. సోదరి,సోదరులు ఒకరి మేలు మరొకరు కోరుకునే సందర్భం ఇది. తమకు అండగా సోదరులు ఉన్నారన్న ధీమా ఆడపిల్లలకు కలిగించే పండుగ రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన వారికన్నా ఆత్మీయులు మరెవరూ ఉండరన్న సత్యాన్ని బోధించే పండుగ ఇది. అనుబంధాలను పెంపు చేస్తూ, బాధ్యతలను గుర్తు చేసే వేడుక రాఖీ పౌర్ణమి.
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల॥
‘ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. దీని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలి’ అని పై శ్లోకానికి అర్థం. బలిచక్రవర్తిపై అభిమానంతో విష్ణుమూర్తి అతని దగ్గరే చిక్కుకుపోతాడు. శ్రీహరిని విడిపించడానికి బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతున్నది. ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

