శ్రీశైలంలో శ్రావణ మంగళవార పూజలు

శ్రీశైలం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ మంగళవారం పరివార దేవుళ్లకు ప్రత్యేక పూజాధికాలను నిర్వహించినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న కుమారస్వామికి ఉదయం షోడషోపచార పూజాది క్రతువులు చేశారు. అదే విధంగా శివభక్త గణాలకు అధిపతి అయిన బయలు వీరభద్రునికి సాయంకాలం ప్రదోషకాల పూజలు శాస్రోక్తంగా జరిపించారు. అనంతరం సంధ్యా సమయంలో వీరశిరోమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు.
కోవిడ్ ప్రభావం పూర్తిగా తొలిగిపోయి ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని వేదపండితులు అర్చకులు మహా సంకల్పాన్ని పఠించారు. పంచామృతాలు ఫలపుష్పోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింపజేసి పంచసూక్తం వృషభసూక్తం పఠించారు. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యం సమర్పించారు.

Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

