Toli Ekadashi | తొలి ఏకాదశి ఉపవాసం విశిష్టత.. ఈరోజు పాటించాల్సిన నియమాలివే..
Toli Ekadashi | ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అ త్యంత విశిష్టత ఉంది.. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నా యి. శ్రీమహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడంతో తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు..
Toli Ekadashi | నాగర్‌కర్నూల్ (నమస్తే తెలంగాణ) /గద్వాలటౌన్, జూలై 16 : ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది.. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నా యి. శ్రీమహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండడంతో తొలి ఏకాదశిని శైన ఏకాదశి అని కూడా అంటారు.. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైంది.. 24 ఏకాదశుల్లో ఉపవాసం చేయలేకపోయిన.. ఒక్క ఈ తొలి ఏకాదశి రోజు దీక్ష చేస్తే కోటి పు ణ్యాలకు సాటి అని పండితులు చెబుతున్నారు. ఈ రోజున స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయన్నది నమ్మకం..
ఏడాదికి 24 ఏకాదశిలు ఉంటా యి. ఇందులో మొట్టమొదటిదైన ఏకాదశిని తొలి ఏకాదశిగా, శయన ఏకాదశిగా పిలుస్తారు. విష్ణుమూర్తికి అంకి తం చేసే ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మంగళవారం రోజు రాత్రి 8:34 గంటలకు ప్రారంభమై బుధవారం రోజు రాత్రి 9:03గంటలకు ముగుస్తుంది. కనుక ఈ రోజు భక్తులు ఉపవాస దీక్ష చేస్తారు. పురాణాల ప్రకారం.. ఈ రోజు నుంచి విష్ణుమూర్తి పాలకడలిలో విశ్రాంతి తీసుకుంటాడు. నాలుగు నెలల పాటు నిద్రావస్థలో ఉంటాడు.
స్థితికారకుడైన విష్ణువు నిద్రను యోగనిద్రగా పేర్కొంటారు. పలువురు ఛాతుర్మాస దీక్షలు ప్రారంభిస్తారు. ఇందులో శ్రావణం, భాద్రపదం, అశ్వినీ, కార్తీక మాసాలుంటాయి. దేవుళ్లు క్షీణించిన శక్తిని ధ్యానం, యోగనిద్ర ద్వారా పునరావాసం చేసుకొంటారు. ఇలా శయన ఏకాదశి రోజున నిద్రించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు యోగనిద్ర నుంచి విష్ణుమూర్తి మేల్కొంటారు. అప్పుడు విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటే పుణ్య ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఈ నాలుగు మాసాలపాటు శివుడి చేతిలో పాలన నిర్వహణ ఉంటుంది. ఈ రోజు ఉపవాస దీక్షకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. బ్రహ్మదేవుని వెనుక భాగం నుంచి రెండు చెమట బిందువులు భూమి మీద పడి అవి అన్నవృద్ధులు అనే రాక్షసులుగా జన్మిస్తారు. ఈ రాక్షసులు బ్రహ్మవద్దకు వెళ్లి నివాసానికి వరం కోరుకుంటే ఏకాదశి రోజు అన్నాదులు భుజిస్తే అందులో కొలువై ఉండాలని వరం ఇస్తారు. దీంతో ఈ రోజు భోజనం చేస్తే శరీరంలో క్రిములు జన్మిస్తాయని ఆ పురాణగాథ. అందుకే ఈ రోజు అన్నం తినవద్దని భక్తుల నమ్మకం. ఈరోజు యక్షుడికి చెప్పిన ఏకాదశి కథను వింటే మంచి జరుగుతుంది. విష్ణువు సృష్టికి పోషణ కారకుడు. ఈ ఏకాదశితోనే అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. ఈ ఏకాదశి తర్వాతే నోములు, వ్రతాలు వస్తాయి. ఇందులో ప్రధానమైది శ్రావణమాసం. అందుకు ఈ ఏకాదశి ఉపవాస దీక్ష చేసి గోవుకు పిండి ముద్దలు, గ్రాసం పెట్టి పూజిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.
బెల్లం పానకం, పిండి పదార్థాలు, తీపి పదార్థాలు విష్ణువుకు ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. ఛాతుర్మాస దీక్షలు చేసే భక్తులకు విష్ణు అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రం, నిరంతరం హరిహరిహరి అని పూజిస్తే మేలు జరుగుతుంది. ఉసిరి చెట్టుకు సైతం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఉపవాస దీక్షలో భాగంగా విష్ణు నామస్మరణతో చేస్తూ బ్రాహ్మణులకు అన్నదానంతో ఉపవాసం విరమించాల్సి ఉంటుంది. విష్ణువుకు ఇష్టమైన తులసిని పూజించాల్సి ఉంటుంది. ఏకాదశి వ్రతం విరమించేందుకు తులసీ దళం నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు. అందుకు ఉసిరి కాయలను పూజించడం వల్ల కూడా పిల్లలకు శుభం కలుగుతుంది, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని భక్తుల నమ్మకం. ఏకాదశి ఉపవాసం రోజు మాత్రం అన్నం తినడం నిషేధం. ఈరోజు అన్నం తింటే సరీసృపాల రూపంలో జన్మిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వ్రతం విరమించే ద్వాదశి రోజున తప్పనిసరిగా అన్నం తినాలి. ఇక ఏకాదశి వ్రతంలో ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి, ఉల్లిపాయల్లాంటివి వినియోగించరాదు. ఏకాదశి రోజు స్త్రీలను, పెద్దలను అవమానించవద్దు. బ్రహ్మచర్యం పాటించాలి. తులసి మొక్కలను తెంపకూడదు. ఇతరులపై చెడు ఆలోచనలు చేయరాదు.
ముస్తాబైన ఆలయాలు..
తొలి ఏకాదశికి వైష్ణవ ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. ఏకాదశిని పురస్కరించుకొని బుధవారం వైష్ణవాలయాల్లో పూజలు చేయనున్నారు. తెలవారుజాము నుంచే అభిషేకాలు, అర్చనలు ఆయా ఆలయాల్లో అర్చకులు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరుగంటలకు నిర్మాల్య విసర్జన, ఫలపంచామృతాభిషేకాలు, తులసి, పుష్పార్చనలు వంటి కార్యక్రమా లు నిర్వహి స్తారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

