బాధ్యత తెలిపే రక్షాబంధనం
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది. ఈ సమరంలో దేవతల గెలుపు కోరి శ్రావణ పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి.. శచీదేవి తన భర్త దేవేంద్రుడికి రక్షాబంధం కడుతుంది.
- శుక్రవారం రాఖీ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది. ఈ సమరంలో దేవతల గెలుపు కోరి శ్రావణ పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి.. శచీదేవి తన భర్త దేవేంద్రుడికి రక్షాబంధం కడుతుంది. ఆ రక్ష ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో గెలుస్తాడు. ద్వాపర యుగంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపదీదేవి తన చీర చెంగును చింపి రక్ష కడుతుంది. ఆ రక్షే తర్వాత వస్ర్తాపహరణ ఘట్టంలో ద్రౌపదికి రక్షణగా నిలిచిందన్న కథ కూడా ప్రచారంలో ఉంది.
ఇక చారిత్రక అంశాలను పరిశీలిస్తే.. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భార్య రోక్సానా తన భర్త మేలు కోరి భారత ఉపఖండం వాయవ్య భాగాన్ని పాలిస్తున్న రాజు పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. సోదరి సౌభాగ్యం కోరి పురుషోత్తముడు అలెగ్జాండర్ను ప్రాణాలతో విడిచిపెట్టాడని చెబుతారు. ఇలా రక్షాబంధనం వెనుక అనేకానేక కథలు ప్రచారంలో ఉన్నాయి. లౌకికంగా ఆలోచిస్తే.. సోదరి, సోదరులు ఒకరి మేలు మరొకరు కోరుకునే సందర్భం ఇది. తమకు అండగా సోదరులు ఉన్నారన్న ధీమా ఆడపిల్లలకు కలిగించే పండుగ రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన వారికన్నా ఆత్మీయులు మరెవరూ ఉండరన్న సత్యాన్ని బోధించే పండుగ ఇది. అనుబంధాలను పెంపు చేస్తూ, బాధ్యతలను గుర్తు చేసే వేడుక రాఖీ పౌర్ణమి.
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల॥
‘ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. దీని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలి’ అని పై శ్లోకానికి అర్థం. బలిచక్రవర్తిపై అభిమానంతో విష్ణుమూర్తి అతని దగ్గరే చిక్కుకుపోతాడు. శ్రీహరిని విడిపించడానికి బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతున్నది. ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలి.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

