ttd | ఈ నెల 13 నుంచి నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుమల : నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభంకానున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 12న అంకురార్పణం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. 13న ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవ, 14న చిన్నశేష వాహనం, హంస వాహన సేవ, 15న సింహ వాహనం ముత్యపుపందిరి వాహన సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.
16న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవ, 17న మోహినీ అవతారం, గరుడ వాహన సేవ, 18న హనుమంత వాహనం, గజ వాహన సేవ, 19న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవ, 20న రథోత్సవం, కల్యాణోత్సవం, అశ్వవాహన సేవ, 21న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఉత్సవాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 930 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయని చెప్పారు. 20న రాత్రి 7.30 నుంచి 9 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుందని, ఆసక్తి ఉన్న భక్తులు రూ.1000 చెల్లించి పాల్గొనవచ్చని చెప్పారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

