సర్పం నమామి
శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతణ్ని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన నాడు సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని వరం అడుగుతాడు ఆదిశేషుడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు.
- మంగళవారం నాగుల పంచమి
శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమిని నాగపంచమిగా జరుపుకోవటం ఆనవాయితీ. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతణ్ని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సర్పజాతి ఆవిర్భవించిన నాడు సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని వరం అడుగుతాడు ఆదిశేషుడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకొనే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది. ఈ సందర్భంగా నాగులకు ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యంగా పాలు సమర్పిస్తారు. వర్షాకాలంలో పాములు పుట్టల్లోంచి బయటికి వచ్చి, సంచరిస్తాయి.
ఈ సమయంలో పాములు పంటల్ని నాశనం చేసే క్రిమికీటకాల్ని తింటూ రైతుకు పంటనష్టం కలగకుండా పరోక్షంగా సాయం చేస్తాయి. పంట పొలాలకు శత్రువులు ఎలుకలు. వాటిని నిర్మూలించేవి పాములు. ఏదైనా కారణం వల్ల క్రమంగా పాములు కనుమరుగైతే, మానవాళి మనుగడకే ప్రమాదం. ఈ క్రమంలో పంటలను కాపాడే పాములను రైతులు దేవతలుగా భావిస్తారు. వాటికి కృతజ్ఞత తెలుపుతూ నాగులను పూజించే ఆచారం ఏర్పడిందని పెద్దల మాట.
నాగపంచమి రోజునే గరుడ పంచమి జరుపుకొనే ఆచారం కూడా వ్యాప్తిలో ఉంది. తన తల్లి వినతను దాస్యం నుంచి విముక్తురాలిని చెయ్యడం కోసం గరుత్మంతుడు స్వర్గంలో ఉన్న అమృతాన్ని తెచ్చి పినతల్లి కద్రువ కుమారులైన సర్పాలకు ఇచ్చాడు. అమృతాన్ని సాధించటం కోసం గరుత్మంతుడు చేసిన భీకరమైన పోరాటానికి, అతని మాతృభక్తికి చిహ్నంగా.. ఆయన అమృతాన్ని తెచ్చిన శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమిగా చేసుకుంటారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

