మార్గదర్శి
ఒక పెద్ద వాషింగ్ మెషిన్ డీలర్ తన లాయర్ మిత్రుడితో కలిసి సాయంత్రపు నడక కోసం సముద్ర తీరానికి వెళ్లాడు. వారిద్దరూ పొద్దు పోయేంతవరకు నడిచారు. ఇంటికి బయలుదేరుతున్న సమయంలో వారికి ఒక వృద్ధుడు ఎదురొచ్చాడు. ఆ పెద్దాయన చేతిలో రామాయణ, మహాభారత పుస్తకాలు అమ్మకానికి ఉన్నాయి.
ఒక పెద్ద వాషింగ్ మెషిన్ డీలర్ తన లాయర్ మిత్రుడితో కలిసి సాయంత్రపు నడక కోసం సముద్ర తీరానికి వెళ్లాడు. వారిద్దరూ పొద్దు పోయేంతవరకు నడిచారు. ఇంటికి బయలుదేరుతున్న సమయంలో వారికి ఒక వృద్ధుడు ఎదురొచ్చాడు. ఆ పెద్దాయన చేతిలో రామాయణ, మహాభారత పుస్తకాలు అమ్మకానికి ఉన్నాయి. వెంటనే లాయర్ కొన్ని పుస్తకాలు కొనుక్కున్నాడు. పరమానందభరితుడైన వృద్ధుడు డీలర్ వైపు తిరిగి ‘మీరు కూడా కొనుక్కోండి’ అన్నాడు. డీలర్ నవ్వాడు. ‘నాకెందుకీ పుస్తకాలు? వీటి అవసరం నాకేముంది! ఎంతో పెద్ద జీవితాన్ని చూసిన వాడిని నేను’ అని చెప్పి కారు ఎక్కబోయాడు. లాయర్ గబగబా డీలర్ దగ్గరకు వచ్చి ‘మిత్రమా… నువ్వు పట్టణంలోనే పెద్ద వాషింగ్ మెషిన్ డీలర్వి కదా.
మీరు వాషింగ్ మెషిన్లను కస్టమర్లకు అమ్మేటప్పుడు ఉత్త మెషిన్లు మాత్రమే ఇస్తారా?’ అని ప్రశ్నించాడు. డీలర్ నవ్వుతూ ‘అంత మాత్రం తెలియదా, మెషిన్లతో పాటు దాన్ని ఎలా వాడాలో తెలియజేసే యూజర్ మాన్యువల్ కూడా అందిస్తాము’ అని బదులిచ్చాడు. ‘మొదటిసారి మెషిన్ కొనేవారికేనా, లేక అనేక సార్లు కొన్నవారికి కూడా వీటిని ఇస్తారా?’ అని అడిగాడు లాయర్. ‘కొత్త పాత అనేది లేదు. ప్రతి ఒక్కరికీ యూజర్ మాన్యువల్ అందిస్తాము. ఎందుకంటే మెషిన్ ఎలా పని చేస్తుందో, ఎలా వాడాలో, ఎలా వాడకూడదో తెలియజెప్పాల్సిన బాధ్యత మాది. అంతే కాకుండా మెషిన్ల మోడల్స్, వాటి టెక్నాలజీ దేనికదే ప్రత్యేకం’ అని బదులిచ్చాడు.
మిత్రుడి భుజం తడుతూ లాయర్ ‘రామాయణ మహాభారత ఇతిహాసాలు మనకి యూజర్ మాన్యువల్స్ లాంటివి. మన జీవితాన్ని ఎలా గడపాలో, మన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా జీవించాలో తెలియజేసే గ్రంథాలవి. అవి తీసుకోనని చెబుతున్నావేమి?’ అని ఎదురు ప్రశ్న వేశాడు. డీలర్ తన ఆలోచన తప్పని తెలుసుకున్నాడు. ‘రామాయణం మార్గదీపం, మహాభారతం ధర్మ దర్పణం. మన జీవన యాత్రకు ఇవే నిజమైన మార్గ దర్శనం’ అని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ వృద్ధుడి దగ్గర కొన్ని పుస్తకాలను కొనుక్కున్నాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

