HomeDevotionalLas Investigaciones Teologicas Deben Hacerse Contando Las Historias De Dios
సత్యవాక్కు కామధేనువు
వాక్ శుద్ధి ఏర్పడాలంటే చేయాల్సిన పని.. వాక్కుతో దైవనామాన్ని స్మరించాలి. హిత, మిత, స్మిత, సత్య వచనాలు పలకాలి. భగవంతుడి కథలను చెప్పుకొంటూ వేదాంత విచారణలు చేయాలి. మలిన వాక్కులు పలికే నోటికి పవిత్రమైన భగవన్నామం పలికే అర్హత లేదన్నది శాస్త్ర వచనం.
వాక్ శుద్ధి ఏర్పడాలంటే చేయాల్సిన పని.. వాక్కుతో దైవనామాన్ని స్మరించాలి. హిత, మిత, స్మిత, సత్య వచనాలు పలకాలి. భగవంతుడి కథలను చెప్పుకొంటూ వేదాంత విచారణలు చేయాలి. మలిన వాక్కులు పలికే నోటికి పవిత్రమైన భగవన్నామం పలికే అర్హత లేదన్నది శాస్త్ర వచనం. అసత్యం పలకడం అశౌచమే! అసత్యవాది మాటలకు సమాజంలో ప్రామాణికత ఉండదు. వినయపూర్వక సత్య వచనాలు పలకడం వల్ల ఆనందమే కాకుండా వాక్కుకు రాణింపు, కార్యసిద్ధి కలుగుతాయి.
‘సూనృతమైన (సత్య)వాక్కు కామధేనువు లాంటిది. అది కీర్తిని, గౌరవాన్ని ఇస్తుంది. శత్రువులను తరిమేస్తుంది. కాబట్టి సత్యవాక్కును పలకడం జీవితంలో భాగం చేసుకోవాలి. అబద్ధం చెప్పడం, ఇచ్చినమాట తప్పడం, పరుష పదజాలం ఉపయోగించడం, వాక్కు అశౌచం కావడానికి కారణం అవుతాయి’ అని ఉత్తర రామచరితంలో భవభూతి పేర్కొన్నాడు. కాబట్టి ప్రయత్న పూర్వకంగా అయినా ప్రియవాక్కులు పలకడం అలవాటు చేసుకోవాలి. సాధన క్రమంలో వాక్కుకు శుద్ధి కలుగుతుంది.