ఉపాసనతోనే జీవన్ముక్తి
‘అతణ్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది’ అనే మాట లోకంలో తరచూ వింటుంటాం. సాధారణంగా అదృష్టం అంటే కనిపించదని భావిస్తుంటాం. కానీ, పూర్వజన్మ సుకృతమే ఈ జన్మలో అదృష్టం రూపంలో పలకరిస్తుందని పెద్దల మాట.
‘అతణ్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది’ అనే మాట లోకంలో తరచూ వింటుంటాం. సాధారణంగా అదృష్టం అంటే కనిపించదని భావిస్తుంటాం. కానీ, పూర్వజన్మ సుకృతమే ఈ జన్మలో అదృష్టం రూపంలో పలకరిస్తుందని పెద్దల మాట. అయితే, అదృష్టం అనుకోకుండా వరించిందన్న మాటల ఆంతర్యాన్ని గమనించాల్సి ఉంది. తనకు అదృష్టం కలుగుతుందని ముందుగా ఎవరూ ఊహించలేరు. కానీ, ఈ అదృష్టం ఊరకే రాదు. మనం చేసే సత్కర్మలను బట్టి ఇది ప్రతిఫలిస్తుంటుంది. కర్మఫలం అనుభవించకుండా ఉండలేం. ఈ కర్మఫలమే ఒక్కోసారి అదృష్టం రూపంలో మనిషిని వరిస్తుంది. కర్మ సిద్ధాంతంలోని రహస్యమిదే!
అదృష్టవంతుణ్ని చూసి, అతనికి యోగం పట్టుకుందని చెప్పుకొనే వాళ్లూ ఉంటారు. ఈ ‘యోగం’ అనే శబ్దానికి తైత్తిరీయ ఉపనిషత్తు సంపాదన అనే అర్థాన్ని తెలుపుతుంది. ‘యోగక్షేమాలు’ అనే మాటలను తరచూ వింటుంటాం. యోగం అంటే సంపాదించుకోవడం, క్షేమం అంటే సంపాదించిన దానిని భద్రంగా ఉపయోగించుకోవడం. ఎవరైనా తమ నైపుణ్యాలను బట్టి కావలసిన వస్తువులను సంపాదించుకోవచ్చు. కేవలం వస్తువులనే కాదు పుణ్యాన్ని కూడా సంపాదించుకోవాలని మన ధర్మగ్రంథాలు బోధిస్తున్నాయి. ఒక వస్తువు మనకు ఉపయోగంలోకి రావాలంటే అది మనం సంపాదించుకున్న దాన్నిబట్టి ఉంటుంది. ‘యోగం’ ఎంత పవిత్రమైనదో ‘ఉపయోగం’ అంత ఉన్నతంగా ఉండాలి. ‘ఉప’ అనే ఉపసర్గకు ‘సమీపం’ అని అర్థం. అప్పుడు న్యాయంగా సంపాదించుకున్న దానికి సమీపంలో ఉండమనే సందేశం ఇందులో ఇమిడి ఉంది.
కర్మఫలాలను అంటుకోకుండా, జీవన్ముక్తికి ప్రయత్నించడమే యోగం. చిత్తవృత్తులను నిరోధించడమే ‘యోగం’ అంటారు పతంజలి మహర్షి. నిజానికి యోగులు చిత్తవృత్తులకు దూరంగా ఉంటారు. ‘నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను’ అని శ్రీకృష్ణ పరమాత్మ భరోసానిచ్చాడు. మనిషి లౌకిక జగత్తులో కర్తవ్య కర్మలు చేసి పుణ్యం ఆర్జించినా, ఎన్ని సుఖభోగాలు అనుభవించినా.. పరమ పురుషార్థమైన మోక్షాన్ని సంపాదించాలంటే యోగమే శరణ్యం. అందుకే విద్వాంసులు ‘ప్రపంచ పదార్థాలను ఉపయోగించు, పరమాత్ముడిని ఉపాసించు’ అని ఉద్బోధించారు. మనం ఎన్నాళ్లు భౌతిక సంపదకు సమీపంలో ఉన్నా ముక్తి లభించదు. కేవలం పరమేశ్వరుడికి సమీపంలో ఉండటం (ఉపాసన) వల్లే భవబంధాల నుంచి విముక్తి పొందగలుగుతాం.
– ఆచార్య మసన చెన్నప్ప, 98856 54381
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

