తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఎలా చేయాలి?
ఉపవాస దీక్ష | హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి.

హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. అయితే హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. ఇంత ప్రత్యేకత ఉన్న తొలి ఏకాదశి రోజున వ్రతం చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున ఆవులను పూజించాలి.. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది.. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.
వ్రత విధానం : ఉపవాసం ముఖ్యోద్దేశ్యం ‘ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడి ప్రసన్నతయే’. ఈ తిథినాడు మరింత భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుని ఆరాధనలో నిమగ్నం కావాలి. ఏ విధమైన తృణధాన్యాలనూ తినకూడదు. వీలైతే ఆహారాన్ని పూర్తిగా త్యజించాలి. ఉపవాసాన్ని ఆచరింపలేని వృద్ధులు తదితరులు పండ్లు, పాలు మొదలైన వాటిని మితంగా స్వీకరించవచ్చు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Fasting
- gopuja
- myths
- Toli Ekadashi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

