Srisailam Temple | శ్రీశైలంలో ఘనంగా గురుపౌర్ణమి.. దక్షిణామూర్తికి విశేషపూజలు..
Srisailam Temple | శ్రీశైలం : గురుపౌర్ణమి వేడుకలు శ్రీశైల దేవస్థానంలో ఘనంగా జరిగాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి-మహారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి, వ్యాసమహర్షికి విశేష పూజలు నిర్వహించారు.
Srisailam Temple | శ్రీశైలం : గురుపౌర్ణమి వేడుకలు శ్రీశైల దేవస్థానంలో ఘనంగా జరిగాయి. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి-మహారెడ్డి మల్లమ్మ మందిరం వద్ద దక్షిణామూర్తి, వ్యాసమహర్షికి విశేష పూజలు నిర్వహించారు. మొదట పూజాసంకల్పం పఠించి.. మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం దక్షిణామూర్తి, వ్యాసమహర్షి చిత్రపటాలకు షోడశోపచార పూజలు నిర్వహించారు. ‘ఒకేరాశిగా ఉన్న వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసి లోకానికి అందించిన వ్యాస మహర్షి కారణజన్ముడు.
వ్యాసమహర్షి అసలు పేరు ‘కృష్ణద్వైపాయనుడు’ వేదాలను నాలుగు విభాగాలుగా విభజించి లోకానికి అందించిన కారణంగా ఆయనకు వేదవ్యాసుడు అనే పేరు ప్రసిద్ధమైంది. మంత్రరూపంలో ఉన్న వేదాల పరమార్థాన్ని గ్రహించలేని సామాన్యుల కోసం వ్యాసమహర్షి మహాభారతాన్ని సైతం రచించాడు. దాంతోనే మహాభారత గ్రంథం పంచమవేదంగా పేరొందింది. అదేవిధంగా లోకకల్యాణం కోసం వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణాలను సైతం రచించారు. లోకంలో ఉండే ప్రతీ విషయాన్ని సైతం వ్యాసమహర్షి తన సాహిత్యంలో పేర్కొన్నారు. అందుకే ఆయన చెప్పని విషయాలు ఏవీ లోకంలో కనబడవనే భావన ఎంతో ప్రసిద్ధం’ అని పండితులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

