Ganesh Chaturthi | వినాయక చవితికి తప్ప మిగిలిన రోజుల్లో గణపతిని తులసీ దళాలతో ఎందుకు పూజించవద్దు?
Ganesh Chaturthi | గణపతికి తులసి దళం సమర్పించకూడదని చెబుతారు ఎందుకు? వినాయక చవితి రోజు మాత్రం తులసి సమర్పించడం వెనుక కారణం ఏమైనా ఉన్నదా?
Ganesh Chaturthi | గణపతికి తులసి దళం సమర్పించకూడదని చెబుతారు ఎందుకు? వినాయక చవితి రోజు మాత్రం తులసి సమర్పించడం వెనుక కారణం ఏమైనా ఉన్నదా?
నాక్షతైః అర్చయేద్విష్ణుం న తులస్యా గణాధిపం! అనేది శాస్త్ర ప్రమాణం. అక్షతలతో విష్ణు మూర్తికి, తులసీ దళాలతో గణపతికి పూజచేయగూడదని ఈ నియమం చెపుతుంది. తులసీ దళాలను గణపతికి వాడక పోవడానికి పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది. హంసధ్వజుని పుత్రుడైన ధర్మధ్వజునికి విష్ణువు అంశ వలన కలిగిన సంతానమే తులసి. ఈమె గంగా నదీ తీరంలో విహరిస్తున్నప్పుడు అటుగా వచ్చిన గణపతిని చూచి మోహిస్తుంది. తనను వివాహం చేసుకొమ్మని గణపతిని అడుగుతుంది. అందుకు వినాయకుడు ఒప్పుకోకపోవడంతో ‘దీర్ఘకాలం బ్రహ్మచారిగానే ఉండిపొమ్మ’ని గణపతిని శపిస్తుంది తులసి. ‘రాక్షసునికి జీవితాంతం బందీగా ఉండిపొమ్మని’ ప్రతిశాపం ఇస్తాడు వినాయకుడు.
అయితే, ఆ శాపాన్ని భరించలేనని తులసి వేడుకోగా.. ‘విష్ణుమూర్తి వలన విమోచనం పొంది తులసీ వృక్షంగా అవతరిస్తావ’ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత తులసి బ్రహ్మదేవుని వరంతో శంఖచూడుడనే రాక్షసున్ని వివాహమాడుతుంది. కృష్ణ కవచం ఉందనే గర్వంతో దేవతలందరినీ అతడు బాధిస్తుంటాడు. తులసీదేవి పాతివ్రత్య మహిమతో అతణ్నెవరూ జయించ లేకపోతారు. వినాయకుని సాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణువు. తర్వాత శ్రీహరి వరంతో తులసి.. మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి సహకరించిన గణపతిని ‘శిరస్సు లేకుండుగాక’ అని తులసి శపిస్తుంది. తనను శపించిందన్న కోపంతో తెలసి సాన్నిహిత్యాన్ని సహింపనని చెబుతాడు గణపతి. వినాయక చవితి రోజు మాత్రం మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది. అందుకే, వినాయకచవితి రోజు మినహా మరేరోజూ వినాయకుడికి తులసి సమర్పించరు.
డా॥ శాస్త్రుల రఘుపతి,73867 58370
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

