హలీమా ఇంట శుభాల పంట
పూర్వం సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు పాల పోషణ కోసం ప్రత్యేకంగా దాదీలు ఉండేవాళ్లు. పల్లె నుంచి నిరుపేద దాదీలు పట్నం వచ్చి సంపన్నుల ఇండ్లలో కొంతకాలం ఉండేవాళ్లు. కొందరు తమ వెంట పిల్లలను తీసుకెళ్లి రెండేండ్ల తర్వాత తిరిగి అప్పగించేవాళ్లు. అందుకు గానూ, ఎంతోకొంత వారికి ముడుతుండేది.
గురువారం మిలాద్-ఉన్-నబీ
పూర్వం సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు పాల పోషణ కోసం ప్రత్యేకంగా దాదీలు ఉండేవాళ్లు. పల్లె నుంచి నిరుపేద దాదీలు పట్నం వచ్చి సంపన్నుల ఇండ్లలో కొంతకాలం ఉండేవాళ్లు. కొందరు తమ వెంట పిల్లలను తీసుకెళ్లి రెండేండ్ల తర్వాత తిరిగి అప్పగించేవాళ్లు. అందుకు గానూ, ఎంతోకొంత వారికి ముడుతుండేది. ప్రవక్త కాలంలో అరబ్బు ప్రాంతంలోనూ ఈ విధానం కనిపించేది. అలా ఒకరోజు సమీప గ్రామం నుంచి కొందరు ఆయాలు పట్నానికి వచ్చారు. అలా వచ్చినవారిలో హలీమా ఒకరు. ఆమె వెంట తన భర్త కూడా వచ్చాడు. బక్కచిక్కిన హలీమాకు ఎవరూ తమ బిడ్డను ఇవ్వడానికి ముందుకురాలేదు. అదే సమయంలో తండ్రిని కోల్పోయిన ఓ పిల్లాడికి పాలు ఇవ్వడానికి ఒక్క ఆయా ఒప్పుకోలేదు. చివరికి ఆ పిల్లాణ్ని తనవెంట తీసుకెళ్లాలని భావించింది హలీమా. ఆ పిల్లాడి ఇంటివైపు వెళ్లింది. ఆ పసివాడి తల్లి ఆమినా తన బాబును ఎవరూ తీసుకోకపోవడంతో నిరుత్సాహపడింది. ఇంతలో హలీమా గుమ్మం ముందుకు రావడంతో ఆమినా ఆశలు చిగురించాయి.
‘అమ్మగారూ! మీ బాబును నేను తీసుకెళ్తాను’ అన్నది హలీమా. ఆమినా సంతోషించింది. బాబును మనసారా గుండెలకు హత్తుకొని ఆ పసివాణ్ని హలీమా చేతుల్లో పెట్టింది. పిల్లవాణ్ని తీసుకొని హలీమా దంపతులు ఇద్దరూ తమ గ్రామానికి బయల్దేరారు. బక్కచిక్కిన వాళ్ల ఒంటె హుషారుగా నడవడం మొదలుపెట్టింది. అదే సమయంలో పిల్లాడు ఆకలితో ఏడ్వడంతో తన స్తన్యాన్ని పసివాడి నోటికి అందించింది హలీమా. ఆమె స్తనాలు పాలతో నిండిపోయాయి. పిల్లవాడు ఏకధాటిగా పాలు తాగాడు. ఆ బాలుడికే కాదు తన సొంత కూతురుకూ కడుపారా పాలుపట్టింది. హలీమా ఆశ్చర్యంతో ఆనందాశ్రువులు విడిచింది. ఆ పసివాడి రాకతో హలీమా ఇంట శుభాల పంటపండింది. ‘హలీమా! మనమెంత అదృష్టవంతులం! ఈ బాబు మనింట బంగారు గని అయ్యాడు’ అన్నాడు హలీమా భర్త. హలీమా రెండేళ్లపాటు పాలిచ్చి పెద్దచేసిన ఆ శిశువు మరెవరో కాదు ఇస్లామ్ ప్రవక్త ముహమ్మద్ (స). ప్రవక్త తల్లికడుపులో ఉండగానే తండ్రి అబ్దుల్లాహ్ కన్నుమూశాడు. తాత అబ్దుల్ ముత్తలిబ్, బాబాయి అబూతాలిబ్ ప్రవక్తను పెంచి పెద్దచేశారు. ఆరేండ్ల వయసులో తల్లిని కూడా కోల్పోయారు. ముహమ్మద్ ప్రవక్త 40 ఏండ్ల వయసులో అల్లాహ్ తరఫున దైవ ప్రవక్తగా నియుక్తులయ్యారు.
…? ముహమ్మద్ ముజాహిద్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
Cyberabad Police | పోలీసు గస్తీకి సుస్తీ.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దందాలు, సెటిల్ మెంట్లతో ఖాకీలు బిజీ!
Horoscope | 21-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

