ఏ రాశిలో పుట్టిన పిల్లల్లోఎంత టాలెంట్ ఉంటుందో తెలుసా..!

హైదరాబాద్ , మే 25 : పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలాగాప్రవర్తిస్తుంటారు. అయితే వీరిలో అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు. వారి అభిరుచులు, అలవాట్లు విభిన్నంగా ఉంటాయి. అంతేకాదు ఒక్కొరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో..తెలుసుకుందాం..
మేషరాశి పిల్లలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితిలో అయినా చిటికలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. అంతేకాదు ఎవరైనా సమస్యల్లో ఉంటె వెంటనే స్పందిస్తారు.వృషభ రాశిలో పుట్టిన పిల్లలు ఎవ్వరు ఊహించని స్థాయిలో ఎదుగుతారు. అంతేకాదు వీరు అనుకున్న పనిని ఖచ్చితంగా సాధిస్తారు. సంకల్ప బలంతో ఎంత పెద్ద పని అయినా సాధిస్తారు.

మిథున రాశిలో జన్మించిన పిల్లలు మంచి క్రియేటివ్ ఆలోచనలను కలిగి ఉంటారు. వీరు మంచి మాటకారులు కూడా అవుతారు. ఏ పనైనా క్రియేటివ్ గా చేస్తారు. చిన్న వయసు నుండే పెద్ద పెద్ద ఆలోచనలను కలిగి ఉంటారు. కర్కాటక రాశి వారు ఎదుటివారి భావాలను అర్ధం చేసుకుని దానిని బట్టి నడుచుకుంటారు. ఎంత వ్యక్తి స్వభావాన్ని అయినా యిట్టె అర్ధం చేసుకునే నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ఏ విషయాన్నీ దాచుకోలేరు.
సింహరాశి లో పుట్టిన పిల్లలు నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ఇలాంటివారు అనే విధంగా ప్రవర్తిస్తారు. అంతులేని శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. వీరు ఒక్కపని అనుకుంటే దానికి భయపెట్టో బతిమిలాడో చేయించుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. లీడర్ షిప్ క్వాలిటీస్ అధికంగా ఉంటాయి. కన్యారాశిలో జన్మించిన పిల్లలు ప్రతి విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు. చిన్న వయసు నుండే అన్ని పనుల్లో ఖచ్చితంగా ఉండాలని అనుకుంటారు. ఆటల్లో, చదువులో అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంటారు.
తులారాశిలో జన్మించిన పిల్లలకు సహనం, ఓర్పు ఎక్కువ. ఇతరులతో పనులు పూర్తి చేయించుకోవడంలో ముందు ఉంటారు. ఎవరిత్తొ ఎలా ప్రవర్తించాలో, ఎలా ఇంప్రెస్ చేయాలో బాగా తెలుసు. అందుకే వేళ్ళు అడిగితే ఎవ్వరైనా ఒప్పుకుంటారు. వృశ్చిక రాసిలో పుట్టిన పల్లాలు ఏదైనా పని అనుకుంటే ఆ గోల్ రీచ్ అయ్యే వరకు కష్టపడతారు. ఏ పని మీదైనా ఫోకస్ పెట్టి చేస్తారు. అన్ని రంగాల్లో రాణించగల నైపుణ్యం వీరికి ఉంటుంది. వీరు ప్రత్యేక అభిరుచులు కలిగి ఉంటారు.
ధనుస్సు రాసిలో పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరితో నవ్వుతు సరదాగా ఉంటారు. ఎంత కష్టానైనా ఇష్టంగా చేస్తారు. సమస్య ఎంత పెద్దదైన, ఎంత అసాధ్యమైన గట్టి సంకల్పంతో దానిని పూర్తి చేస్తారు.మకర రాశిలో జన్మించిన పిల్లలకు మెచూరిటీ ఎక్కువ. చిన్న వయసులోనే ఎక్కువ తెలుసుకుంటారు. వృధా అనుకుంటే ఆ పని అస్సలు చేయరు. ప్రతి విషయాన్నీ చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు. వీరు చాలా సమర్ధత కలిగి ఉంటారు.
కుంభ రాశిలో పుట్టిన పిల్లలకు క్రియేటివిటీ ఎక్కువ. సమస్యలను నుండి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. కొత్త కొత్త అంశాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు.మీనా రాశిలో జన్మించిన పిల్లలు వండర్ ఫుల్ కిడ్స్ అనే చెప్పాలి. ఇతరుల సమస్యలను వారి బాగోగులను చూసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. ఎవ్వరు ఏమి చెప్పిన అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- astrology
- Children
- zodiac sign
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

