TTD News | నవంబర్‌కు సంబంధించి అంగప్రదక్షిణం, డిసెంబర్ మాసానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్ల కోటాను శుక్రవారం విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు, ఆర్జిత సేవా టికెట్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు దేవస్థానం పేర్కొంది.
డిసెంబర్ మాసానికి సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవలను ఆన్లైన్ లక్కీడీప్‌లో ఈ నెల 22న ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. భక్తులు విషయాన్ని గమనించి tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం కోరింది.